అందరు నన్ను విడచినా Lyrics – Tony Prakash
Singer | Tony Prakash |
Composer | |
Music | |
Song Writer | Tony Prakash |
అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)
లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)
వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)
నేను నిన్ను నమ్ముకొంటినిa
నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను|
అపరాధిని యేసయ్యా song lyrics
“అందరు నన్ను విడచినా” అనే క్రైస్తవ గీత రచయిత: Tony Prakash, మనకు దేవుని అపారమైన ప్రేమను సూచిస్తుంది. ఈ గీతం మన జీవితంలో వచ్చే కష్టాలు, ఒంటరితనం, లేదా విపత్కర పరిస్థితుల్లో మనకు శాంతిని, ధైర్యాన్ని అందిస్తుంది. దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడని, ప్రతి సమయంలో మనతో ఉంటాడని ఈ గీతం చెబుతుంది. ఇది ఒక ఆత్మీయ సందేశం, మనలో విశ్వాసాన్ని పెంచి ఆశతో ముందుకు సాగటానికి ప్రేరణ ఇస్తుంది. ఈ గీతం పాడినప్పుడు, మన హృదయం ప్రశాంతతతో నిండిపోతుంది. దేవుని ప్రేమను అందరి జీవితాల్లో పరిపూర్ణంగా అనుభవించమని కోరుతూ, ఈ గీతం మనకు దీవెనల సందేశం ఇస్తుంది.