ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము (2)
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)

ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2)
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం       ||నేను||

1.ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును
మేలులతో నింపితివే– (2)
ఎట్టి కీడైన తలంచని నీవు
ఏ తండ్రైన నీలాగ లేరు చే – (2) || ఎబినేజరు ||

2.అనుదినము నా అవసరతలన్నియు
పొందితి నీ కరము చే – (2)
నీ నడిపింపు వివరించలేను
ఒక పరిపూర్ణ మాటైన లేదు – (2) || ఎబినేజరు ||

3.జ్ఞానుల మధ్యలో వెఱ్ఱివాడనైన నన్ను
పిలిచినది అధ్బుతము – (2)
నేను దేనికి పాత్రను కాదు
ఇది కృపయే వేరేమి లేదు – (2) ) || ఎబినేజరు ||

ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు song lyrics

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *