కదురుతో గుచ్చిన చెవి
నిర్గమకాండము 21 :6
….. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై యుండును.
ఏ యజమానుడైనను ఒక బానిసను కొంత రొక్కం ఇచ్చి కొన్న తర్వాత అతన్ని నిరంతరం తన దగ్గర ఉంచుకొనుటకు ఆ బానిస లేదా ఆ దాసుని చెవి కుట్టించి తన గుర్తు వేసుకొని ఉండును.ఇది బానిస ఎవనికి దాసుడై వున్నాడో తెలియచేస్తుంది.
దేవుని మహిమ పరిచే క్రిస్టమస్ ఎలా జరుపుకోవాలి
మనలని మనము పరీక్షించు కొనిన యెడల ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు రోమా 3 : 23.
ధర్మశాస్త్ర గ్రంథమందు ఆ దేవాది దేవుడు మానవ జీవితాని ఎలా జీవించాలో ఆజ్ఞలు విధులు నిర్ణయించారు వాటన్నిటిని అల్పమైన మానవుడు పాటించలేక శిక్షను కొనుతెచ్చుకున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి అందరము పాపులము అయితీమి.
యోహాను సువార్త 8:34 అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ విధంగా ఒకప్పుడు పాపానికి దాసులమై వుంటిమి.
అయితే యేసు ప్రభువు వారి సిలువ త్యాగం వలన మనము పాపపు దాస్యత్యం నుండి విడుదల పొంది స్వతంత్రుల మైధిమి.
1 కోరింథీయులకు 7:22 ప్రభువు నందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వతంత్రం పొందిన వాడు.
రోమా 6:14 మీరు కృపకే గాని ధర్మ శాస్త్రం లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.
ఈ విధంగా స్వతంత్రులమైన మనలను క్రీస్తు హెచ్చరిస్తున్నది ఏమనగా మరియొకమారు దాసులు కాకండి అని వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు
ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. గలతీయులకు 5:1.
సిలువ మరణమును జయించిన ప్రభువు మనలను పాప దాసునిగా లేకుండా చేసారు. అయినను మనము కొన్నిటికి దాసులము అవుతున్నాము,..
…. దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? రోమా 6:16
… ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా! 2 పేతురు 2:19.
ఇప్పుడు మనలను లోబర్చుకునేవి జయించేవి ఏవి అనగా మొబైల్ ఫోను,సోషల్ మీడియా,టీవీ సీరియల్స్, సినిమా, మన అందము లేక పక్కవారి అందము, కారు, బిల్డింగ్, వస్తువులు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్, క్రికెటర్స్, ఆస్తి, హోదా, డబ్బు, గర్వం ఇలా మరెన్నో…
ప్రతి ఒక్కరం ఇలా ఎదో ఒకదానికి దాసులమైనము.
పాప దాస్యము నుండి విడిపించి మన ప్రభువే ఇప్పుడు అయన ఆత్మ ద్వారా మరియు వాక్యము ద్వారా విడిపించును.
ప్రభువే ఆత్మ యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రముండును. 2 కోరింథీయులకు 3:17.
ప్రతి ఒక్క దాస్యము నుండి ఆ యేసు ప్రభువు వారు మనలని స్వతంత్రులను చేయుదురు గాక ఆమెన్.
ReplyForwardAdd reaction |