దేవునివు ఏర్పాటుకు తగినట్లుగా జీవిస్తున్నావా?

good life

దేవునివు ఏర్పాటుకు తగినట్లుగా జీవిస్తున్నావా?

మత్తయి 24:24 అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచు టకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.

మత్తయి 24:31 మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.

అంత్యదినములలో ఏర్పరచబడిన వారిని సహితము సాతాను మోపుచ్చుతాడని, అంతేకాకుండా ఎవరైతే అంతము వరకు సహిస్తారో వారిని దేవుడు పోగుచేస్తారని చెప్తున్నారు…

అయితే ఈ ఏర్పరచబడిన వారు ఎవరు మరి దేవునిచే పోగుపరచబడే గుంపులో మనం ఉండాలి అంటే ఏమి చెయ్యాలి??????

దేవుని యందు విశ్వాసముంచునట్లుగా, రక్షించబడునట్లుగా  అనాదికాలమందే దేవుడు క్రీస్తు ప్రేమచేత మనలను ఏర్పాటు చేసుకున్నారు.

ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను – 2థెస్స 2:13

మనము దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు కానీ ఆయనే మొదట మనలను ప్రేమించి మనలను ఏర్పాటు చేసుకున్నారు.

మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని – యోహాను 15:16

మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను – ఎఫెసీ 1:6

అయితే దేవునిచే ఏర్పాటు చేయబడిన మనం పరిశుద్ధుల గుంపులో ఉండాలి అంటే, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి

ఫలించాలి – యోహాను 15:16

పరిశుద్దులుము, నిర్దోషులమునై జీవించాలి – ఎఫెసీ 1:6

దేవుడు అనుగ్రహించిన వస్త్రములను ధరించుకుని జీవించాలి (జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి – కొలస్సీ 3:12, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై – రోమా 13:14)

అయితే రక్షించబడిన మనం, సంఘములో చేర్చబడిన మనం, పరిశుద్ధుల గుంపులో ఉన్న మనం పరిశుద్ధముగా, నిర్దోషులముగా, ఫలించేవారిగా, యేసుక్రీస్తు ప్రభువుని ధరించిన వారిగా జీవిస్తున్నామా… లేక లోకాశాలతో నిండిపోయి, అపవిత్రముగా, అపరిశుద్ధముగా జీవిస్తున్నామా.. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని సరిచేసుకుందాము… ఇట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక… ఆమేన్…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *