పల్లవి: వింతైన తారక వెలిసింది గగనాన
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)
జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
మనమంతా జగమంతా
తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
చరణం1: ఆకాశమంతా ఆ దూతలంతా
గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే నిత్య మహిమ (2)
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా||
చరణం2: ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
యేసయ్యను దర్శించిరి
ఎంతో విలువైన కానుకలను అర్పించి
రారాజును పూజించిరి (2)
హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||
“వింతైన తారక వెలిసింది గగనాన” ఈ పాట యేసు జన్మను కీర్తిస్తూ, అతని పుట్టిన సందర్భంగా భూలోకానికి వచ్చిన శాంతి, ఆనందాన్ని ప్రకటిస్తుంది. పరలోక దూతలు ప్రకటించిన సువార్త, దివ్య తార ద్వారా చూపబడిన మార్గం, మరియు రక్షకుడైన యేసు కృపా ప్రేమలపై ఈ పాట ఆధారపడింది. ఈ పాట క్రిస్మస్ వేళ గాయకుల గానాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది, చర్చి కార్యక్రమాలు మరియు కర్రోల్స్‌లో వినిపిస్తుంది. అదనంగా మరిన్ని వివరాలు కావాలంటే చెప్పండి!