జీతగాడు గొఱ్ఱెల కాపరి కాడు గనుక గొఱ్ఱెలు తనివి కానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొఱ్ఱెలను పట్టి చదరగొట్టును. (యోహాను 10:12)
ఈ దినాలలో ఎక్కడ చూచిన క్రైస్తవ సేవలో జీతగాని ఆత్మ ఉన్నది. మన హృదయాలలోనికి అది ఇంకిపోకుండునట్లు మనము జాగ్రత్తపడాలి. ఏ క్రైస్తవుడైనను, నిజముగా తన ప్రభువును కలిసినట్లైతే, నిజమైన కల్వరి ప్రత్యక్షత కలగినట్లైతే తన మిగిలిన జీవితమంతా క్రీస్తుకు అతడెంత ఋణగ్రస్తుడోనని భావించి అనుభవిస్తాడు. నిజం చేప్పాలంటే ఒకడు ప్రార్ధనలో దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా ఆయన ముఖమును వెదుకునో తదననుగుణముగా ఆ ఋణభారము పెరుగుచుండును. అటువంటి వ్యక్తికి నాసిరకపు త్యాగములు మరియు శూన్యమైన శిష్యత్వము అనునవి హేయములు.
మనంతట మనము సత్యవంతులముగా నుండాలి. దానిని సరిచేయుట అంత సుళువుకాదు. ప్రతిసారీ ప్రభువు నన్ను విరుగగొట్టుచున్నాడు. అది నాకు కావలెను! ఆయన ఆత్మకు మనలను మనము అప్పగించుకుంటే మన హృదయాలకు ఆయన వాక్యమును అన్వయిస్తాడు. ఆయన వాక్యపు వెలుగులో మన హృదయములను జాగ్రత్తగా పరిశీలించుకుంటాము. మనము ప్రతి ఆలోచనయు పరీక్షించబడి క్రీస్తునొద్దకు చెరపెట్టిరావలెను. (2 కొరిథి 10:5).
ఏదో యాంత్రికంగా ఉండే ఆత్మీయ అనుభవపు మెట్టుకు ప్రస్తుత మానసిక భక్తి దిగజారినది. భోధకులు విధేయతకు అడ్డదారులు భోధించునప్పుడు మూఢ భక్తి గల క్రైస్తవులు ఎంతో సంతోషముగా నుంటారు. నేనీ విషయంలో ఎంతో దుఃఖముతో, భారమైన మనసు కలిగి యున్నాను. పూర్ణ హృదయముతో ఈ విషయమును వ్రాయుచున్నాను. మనము పశ్చాతాపపడాలి. నిజమైన ఉజ్జీవాన్ని కాపాడే భాధ్యతను దేవుడు మనకు అప్పగించినప్పుడు దానిని ఈ దినములలో నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు మనము నిందింపబడాలి.
ఆదివారపు ఆరాధనలో వచ్చు సంఖ్యను చూచి తృప్తిపడే కొన్ని సంఘాలను చూచినప్పుడు నేనేమి చెప్పగలను? మనము అంతకంటే ఎక్కువ ఆశించని దేవుని సేవకులమా? ఆదివారపు సమూహము అసలు పరలోకమునకు వెళ్ళునా? వారిలో ప్రతివారిని క్రీస్తు యొద్దకు నడిపించాలన్న నమ్మకమైన ఆసక్తి లేనియెడల నీవు జీతగాడివే. మనతో ఎల్లప్పుడు ఉంటానని వాగ్దానమిచ్చిన పునరుత్ధాన ప్రభువు లోకమంతటికి మనము సాగాలని ఆజ్ఞాపించుచున్నాడు.*