సమయమును ఎలా సద్వినియోగం చేసుకోవాలి

సమయము, time

దేవుడు మనకు ఇచ్చిన సమయములో సమయమును ప్రార్థన కొరకు కేటాయించాలి. మనము అన్నింటికీ సమయము ఇస్తున్నాము కానీ ప్రార్థనకు సమయము ఇవ్వడం లేదు. ఇచ్చిన చాలా కొద్దీ సమయమును ఇస్తున్నాము.

పౌలుగారు కొలస్సీయులకు వ్రాస్తూ వారు ప్రార్ధనలో నిలకడగా ఉండాలని ప్రార్థనతో సమయము సద్వినియోగ పరుచుకోవాలి అని తెలియపరిచారు. ( కొలొస్సయులకు 4:2-5).

పేతురు, యెహోను వారి పరిచర్యలో దేవుడు వారికి ఇచ్చిన సమయమును వారు ప్రార్ధనలో గడిపినట్టు గా వారి సమయమును ప్రార్థన విషయములో సద్వినియోగ పరచుకుని నట్లు ప్రార్థనకు వారు ప్రత్యేకమైన సమయమును కలిగి ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాము.

పాత నిబంధన కాలములో కూడా ప్రవక్త అయినటువంటి దానియేలు ప్రార్థన విషయములో సమయమును సద్వినియోగ పరచుకున్నాడు. దేవునికి ముమ్మారు ప్రార్థించేవాడు. ఆ దేశంలో రాజు ఒక శాసనము చేస్తాడు. ముప్పది దినముల వరకూ రాజుకు తప్పా ఎవ్వరికీ కూడదు అట్లు ప్రార్థించిన వారిని సింహాల బోనులో వేయాలి అనే శాసనము చేయబడినది అయిననూ దానియేలు సింహమునకు భయపడక ప్రార్ధన మానక వాడుక చొప్పున ప్రార్థనతో సమయమును సద్వినియోగ పరచుకుని ఉన్నాడు. కాబట్టి ఆ దేశంలో దానియేలు దీవించ బడ్డాడు. ( దానియేలు 6:23).

మన సమయమును ప్రభువు పని కొరకు ఉపయోగించాలి, ఈ దినములలో చాలామంది ఏదో సంపాదించాలనే రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రయాస పడుతున్నారు కుటుంబమును ఆరోగ్యమును కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు కొంతమంది పేరు సంపాదించుకోవాలనే గణము నష్ట పరచుకుంటూ ప్రయాస పడుతున్నారు. దేవుడు ఇచ్చిన సమయమును దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది ఏదో సుఖము అనుభవించాలని ఈ లోకంలో ఆనందమును అనుభవించాలనే సంతోషం పొందాలని ఎవరితోనూ స్నేహము చేయించు రాత్రి, పగలు తేడా లేకుండా చెడు స్నేహం లతో మాటలతో సమయమును దుర్వినియోగ పరుస్తున్నారు.

ఈ రోజుల్లో క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని సేవకులు పెద్ద పెద్ద నాయకులను కలుసుకొనుట ప్రయత్నం చేస్తున్నారు. వారిని కలుసుకొనుట కు వారితో పరిచయాలు పెంచుకొనుట కొరకు వారికి దగ్గర కొరకు ప్రయత్నము చేస్తూ వారి కొరకు దేవుడు ఇచ్చినా దుర్వినియోగము చేస్తున్నారు.

రక్షణ ఈ విషయంలో సమయమును సద్వినియోగం చేసుకోవడం లేదు, చాలామంది రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నారు. ఏదో ఆచార క్రమమును పాటిస్తూ మందిరమునకు వెళ్లి వస్తూ లోక ఆచారము లలో జీవిస్తూ మేము కూడా దేవుని బిడ్డలము విశ్వాసులను క్రైస్తవులము అనే చెప్పుకుంటూ రక్షణకు దూరముగా జీవిస్తున్నారు.

మనము అందరమూ చివరి దినములలో ఉన్నాము. ప్రభువు త్వరగా రాబోవు చున్నాడు. ఆయన రెండవ రాకడలో మేరకు వచ్చినప్పుడు అపవాదిని తన సహచరులను బంధిస్తాడు. కాబట్టి సాతానుకు సమయము కొంచమే ఉన్నందున సాతాను తనకు ఉన్నా సమయములో అనేకమంది సేవకులను విశ్వాసులను దేవునికి దూరము చేయుటకు తన ప్రయత్నములు చేస్తున్నాడు.

క్రైస్తవులారా! ఈ విషయము గమనించి మెలుకువ కలిగి ఒకరి మీద ఒకరు ద్వేషములు పెంచుకోకుండా ఒకరిని ఒక్కరూ దూషించు కోకుండా, ఒకరి కొరకు ఒకరు ప్రార్ధన చేసుకుంటూ ఒకరి విశ్వాసము ఒకరు బలపరచు కుంటూ ఎవరూ దేవునికి దూరము కాకుండా అందరూ ఐక్యత, ప్రేమ, సమాధానము కలిగి జీవిస్తూ ప్రభువు రెండవ రాకడ సమయము కొరకు ఎదురు చూద్దాం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *