Singer | Dr John Wesly & Mrs Blessie Wesly |
Composer | |
Music | |
Song Writer | Dr John Wesly |
అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా
నిన్ను స్తుతించకుండ ఉండగలమా
అన్ని నామముల కన్న పై నామము
నిన్ను కీర్తించకుండ ఉండగలమా
నిన్నే నిన్నే సన్నుతించెదం – సర్వజ్ఞ్యుడవు నీవే అని
నిన్నే నిన్నే ఆరాధించెదం సర్వాధికారం నీదేనని
“ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే”
1. మా మంటి ఘటములలో నీ మహిమను నింపి
నీ రూపులో మమ్ము స్థాపించినావయ్యా…
సంగీత నాదం ఆత్మీయ గానం – మా హృదిలో నింపి నడిపించినావు…
2. మా ప్రతి అవసరము – నీ మహిమలో తీర్చి
నీ ముఖ దర్శనము – మాకొసగితివి…
ఆత్మాభిషేకం ఆశ్చర్య ప్రేమ నిండుగ నొసగి బలపరచినావు