స్థిరపరచువాడవు || ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు

స్థిరపరచువాడవు బలపరచువాడవు
పడిపోయిన చోటే నిలబట్టువాడవు
ఘనపరచువాడవు హెచ్చించువాడవు
మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు  (2)

ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు
నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు (2)
యేసయ్యా.. యేసయ్యా .. నీకే నీకే సాధ్యము (2)

1. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి
నీ చేతిలోనే మా జీవమున్నది (2)
మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి
మా ఊహకు మించిన
కార్యములెన్నో జరిగించుచున్నవి (2) ||ఏమైనా||

2. నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?
నీ కంచే దాటగ శత్రువుకు సాధ్యమా? (2)
మా దేవా నీవే మా తొడుంటే అంతే చాలును
అపవాది తలచిన కీడులన్నీ, మేలైపోవును (2) ||ఏమైనా||

అపరాధిని యేసయ్యా song lyrics

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *