జ్ఞానవంతురాలు మూడురాలు
ఇల్లు కట్టుట అనగా ఇటుకలతో సిమెంట్ తో కొట్టుట కాదు గాని ఒక కుటుంబంలో ఉన్న వారందరి హృదయాలు ప్రేమతోను ఐక్యతను పెన వేయబడి ఉండునట్లు కట్టుట.
దేవుడు మనకు ఇహమందు ఇచ్చిన గృహం పరలోకమునకు నమూనా! ఈనాడు అనేకులు ఎంతో చక్కటి ఇల్లు ఉన్నప్పటికిని; ఆ గృహంలో నివసించే వారికి సంతోషం, సమాధానం లేకుండా ఉండటం చూస్తున్నాము. నేడు చాలామంది గృహములలో భార్యాభర్తల మధ్య సమాధానం లేదు.
భార్య భర్తల లో సమాధానం లేనప్పుడు, వారు వాగ్వాదము లో నిండి ఉన్నప్పుడు పెరిగే బిడ్డలు చిన్న వయసు నుండే తిరగబడే స్వభావం కలిగి ఉంటారు ఇష్టానుసారంగా బ్రతికే వారిగా ఉంటారు. అనేకులు వారి ఇంటి గోడల మీద ” ఈ గృహ అధిపతి ఏసుక్రీస్తు” అని వాక్యమును పెట్టుకొని ఉంటారు కానీ ఏసుక్రీస్తును వారి ఇంటికి ఆహ్వానించారు. ప్రభువు మన గృహాన్ని దర్శించాలనే దీవించాలని ఆశిస్తున్నాడు ప్రభువు అబ్రహాము ను ఆశీర్వదించాలని ఆ గృహమును దర్శించినప్పుడు వారు ఆయనను స్వీకరించి ఆతిథ్యము ఇచ్చినప్పుడు ఆ గృహములోని గొప్ప లోటు తీరిపోయేను. శారా పండు వృద్ధాప్యములో కూడా గర్భవతియై కుమారుని కనును ఆశీర్వదించెను
( ఆదికాండము18:10).
జక్కయ్య ఏసుక్రీస్తు ని చూచి పోదామనుకుని ను కానీ, ఏసుప్రభు జక్కయ్య తో నేను నే ఇంటికి వచ్చేదని చెప్పెను. ఆశ్చర్య పడ్డా జక్కయ్య యేసు ప్రభువును ఇంటికి తీసుకుని వెళ్లగా ఏసుప్రభు దర్శించిన ఆ ఇంటికి రక్షణ వచ్చెను ఆ ఇంటిలోని అన్యాయాలు, పాపములు బయటకు పోయెను.” నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది( లూకా19:1-9) అని ప్రభువు చెప్పెను.
మరియ, మార్తాల ఇంటిలోనికి మరణం వచ్చినప్పుడు ఏసు ప్రభువు కు కబురు పంపగా సమాధిలో పెట్టిన నాలుగు దినముల తరువాత వచ్చినా యేసయ్య, చచ్చి కుళ్ళిపోయిన లాజరును తిరిగి లేపాను. ( యోహాను 11:1-44).
నీవు ఎప్పుడైనా ఏసుప్రభువును మీ ఇంటికి ఆహ్వానించారా? యేసయ్య మా ఇంటికి రావటం లేదండి అనే అనేకులు అంటారు. మనం 101 వ కీర్తనలలో చూస్తున్నట్లు పాపములు కొనసాగుటకు ఆశించిన వారి ఇంటికి, పొరుగు వారిని దూషించు వారి ఇంటికి, అహంకార దృష్టి, గర్వ హృదయము గల వారి ఇంటికి, మోసం చేయు వారిని ఇంటికి, అబద్ధములు ఆడువారి ఇంటికి ఆయన రాలేదు.
అందుకే దావీదు నేను ఉదయముననే లేచి ప్రార్థన ద్వారా మా ఇంటిని పరిశుద్ధపరచు పొందును, అబద్ధములు ఆడువారిని, మోసగించు వారిని నేను మా ఇంటి నుండి తరిమి వేయును; నా ఉదయంలో వాటికి చోటు లేకుండా చేసెదను; మా ఇంట నేను యదార్ధ హృదయముతో నడుచుకొని, నా ప్రభువు ని మా ఇంటికి ఆహ్వానిస్తాను అనే అంటున్నాడు.
యేసయ్య మన ఇంటికి వస్తే ఎంత ఆశీర్వాదం! యేసయ్య ఉన్న చోట మరణం లేదు, వ్యాధి లేదు, కొలతలు లేవు, యేసయ్యను నీ హృదయములో కి ఇంటిలోనికి చేర్చు కొన్నప్పుడు పరలోకాన్ని భూలోకంలోనే అనుభవించుదువు.