దేవుని మహిమ పరిచే క్రిస్టమస్ ఎలా జరుపుకోవాలి

Christmas

దేవుని మహిమ పరిచే క్రిస్టమస్ ఎలా జరుపుకోవాలి? ప్రస్తుత దినాల్లో ఎక్కడ చూసిన ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వీధులలో యేసయ్య జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.

ఘనమైన ఈ శుభ దినాలు అత్యంత కీలకమైన పాత్ర వహించినా ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే అందరి నోట ఒకటే మాట ప్రభువు తల్లి అయిన మరియ. నిజమే ప్రభువు తల్లి అయినా మరియ యేసయ్య జన్మ అంతటిలో కూడా ప్రాముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి మరియా. అయితే ఈ ప్రభువు తల్లి అయినా మరియ సర్వాధికారి అయినా దేవుడు శరీరధారిగా ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆ ప్రభువు తల్లి అయిన మరియ ఏం చేశారు? ప్రభువు తల్లి మరియ నుండి ఒక చిన్న మాట మనము నేర్చుకుందాం!

సర్వాధికారి అయినా దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి రావడానికి తాను ఎన్నుకున్న గర్భము ప్రభువు తల్లి అయిన మరియా, ఆయన ఇష్టపడిన యాత్ర కన్య మరియ, తనకు తల్లిగా ఉండడానికి తనను గర్భములో మోయడానికి ఆమె గర్భంలో ఉండడానికి ప్రభువు ఇష్టపడ్డాడు ఆమె కన్య మరియ.

ఈ కన్య మరియ యేసయ్యను మోసింది, యేసయ్య కొరకు నిందను, అవమానమును అనుభవించింది. ఒక మాట చెప్తాను వింటారా పురిటి నొప్పులతో ఆమె ప్రయాస పడుతుంటే అయిన వారు కానీ పరాయి వాళ్ళు కానీ కనీసం ఆమెను ఎవరి ఇంట్లో చేర్చుకోలేదు. ఒక మాట తెలుసా ఆమె జన్మించింది బెత్లెహేములో, ఆ బెత్లెహేము ఎవరిది ఏసేపు గ్రామం. కానీ ఒక్కరు కూడా ఆదరించలేదు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఉందని ఎరిగిన వారు ఒక్కరు కూడా లేరు. ప్రధానం చేయబడిన మరియు తో గాబ్రియేలు దూత వచ్చి దయా దయా ప్రాప్తి రాలా నీకు శుభము. ఏమిటి ఆ శుభం అని ఆశ్చర్య పడుతుండగానే గాబ్రియేలు దూత అంటుంది పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం దరించ పోతున్నావు అని చెప్పడం జరిగింది. చూడండి పెండ్లి నిశ్చయమైన తరువాత నిజముగా ఆమె గర్భం ధరిస్తే పదిమంది పది రకాలుగా మాట్లాడుతారు అవమానం ఎదురవుతుంది, నిందలు, అవమానాలు భరిస్తూ జీవితాన్ని కొనసాగించాలి.

కానీ ప్రభువు తల్లి అయిన మరియ అంటుంది మీ మాట చొప్పున నాకు జరుగును అని అంటుంది. తండ్రి చిత్తానికి తలవంచింది ప్రభు తల్లి అయిన మరియ. అయితే దేవుని మాటలు చిత్తానికి తల వంచి నిందను భరించి, అవమానాలను భరించి ప్రభువుని తొమ్మిది మాసాలు తన గర్భంలో మోసి ఈ లోకానికి ఒక రక్షకుని అందించిన ఆ ప్రభువు తల్లి అయినా మరియా. దేవుని మహిమ పరిచే క్రిస్టమస్ ఎలా జరుపుకోవాలి? మనము ఏమి చేయాలి? ఆ తల్లిని మాదిరిగా పెట్టుకొని మనము ఏమి చేయాలి అని ఆలోచించి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ప్రజలకు అందిద్దాం ప్రభువు మన అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *