బేత్లేహేములో సందడి – పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని – మహరాజు పుట్టాడనీ
బేత్లేహేములో సందడి – పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని – మహరాజు పుట్టాడనీ
ఆకాశంలో సందడి… చుక్కలలో సందడి ||2||
వెలుగులతో సందడి… మిలమిల మెరిసే సందడి
వెలుగులతో సందడి… మిలమిల మెరిసే సందడి || బేత్లేహేములో ||
దూతల పాటలతో సందడి- సమాధాన వార్తతో సందడి ||2||
గొల్లల పరుగులతో సందడి – క్రిస్మస్ పాటలతో సందడి
గొల్లల పరుగులతో సందడి – క్రిస్మస్ పాటలతో సందడి || బేత్లేహేములో ||
దావీదుపురములో సందడి – రక్షకుని వార్తతో సందడి ||2||
జ్ఞానుల రాకతో సందడి – లోకమంతా సందడి
జ్ఞానుల రాకతో సందడి – లోకమంతా సందడి || బేత్లేహేములో ||
