
*మోచేతి దూరములో దేవుని ఉంచుట* ………………………….. *కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదును. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననెను. ( నిర్గమా 3:10 )* ఇశ్రాయేలీయుల మొఱ్ఱను దేవుడు వినెను. దేవుడు వారి విడుదల కొరకు ఒక మనుష్యుని పంపాలని అనుకొనెను గాని మోషే ఐగుప్తుకు తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అయితే దేవుడు నేను అంతా చేస్తాను. నీవు నా తరుపున నిలబడు అని అన్నాడు. *మనము అనేకవిధాలుగా దేవునిని ఎదురిస్తున్నాము. మన బలము, జ్ఞానము దేవుని చేత ఇవ్వబడినవి. నీ దేహము మరియు మనస్సు దేవుని యొక్క ఈవులు. మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ప్రత్యేకమైన తర్ఫీదునిచ్చినాడు.* *అయితే వెనుకకు తిరిగి నీ జీవితాన్ని చూస్తే మరణానికి సమీపించిన నీవు ఎందుకు మరణించలేదు అని ఆశ్చర్యపడతావు. అనేకమంది చనిపోయారు. కాని నీవు బ్రతికింపబడినావు. ఆ దుష్టులతో నీవెందుకు నాశనము కాలేదు? అదృశ్యమైన దేవుని హస్తము మోషే వెనుక నున్నట్లు నీ వెనుకను ఉన్నది.* దేవుని కొరకు ఉపయోగించబడుటకు నీ దేహము, మనస్సు, ఆత్మ పరికరములుగా నున్నాయి. *దేవుడు అప్పగించిన పని చేయడానికి మోషే తిరస్కరించుచున్నాడు.* *ఆయనతో సహకరించకపోవడమును బట్టి చాలా తరుచుగా మనలను విడచి దేవుడు వెళ్ళుట, దుఃఖముతో ఆయన తలవంచుకొనుట జరుగుచున్నది.* *భారము కలిగిన స్త్రీ, పురుషులను దేవుడు వెదుకుచున్నాడు. మీరు ఆయన జతపనివారని నిన్ను గూర్చి ఆయన చెప్పుచున్నాడు.* *నీలో ఉంచబడిన దేవుని సామర్ధ్యతలు ఫలించి నీ చుట్టూనున్నవారికి ఆశీర్వాదకరముగా నుండులాగున ఉయ్యాల తొట్టిలో నున్నప్పటి నుండి ఆయన నిన్ను గమనించుచున్నాడు. ఆయన నిన్ను గమనిస్తూ, ఆయన సేవకు సరిపోవునట్లు వివిధమైన అనుభవముల ద్వారా దేవుడు నిన్ను మలచుచున్నాడు.* *నీ జీవితాంతము ప్రభువు పేమగల హస్తము ఆశ్చర్యకరముగా క్రియ చేయడము నీవు గమనిస్తే తప్ప, నీవు దేవుని పట్ల కృతజ్ఞత కలిగియుండలేవు. నీ చుట్టూ అనేక వేలమంది యున్నను, ఆయన కనుదృష్టి నీమీద ఉంటుంది.* మోషే లోబడకపోయుంటే ఆయనొక మిద్యానీయుడుగా నశించియుండేవాడు. యవ్వనకాలములో నీ విశ్వాసము ద్వారానే, దుష్టుని నీ శరీరములో జయించాలి. *అణిచివేయబడుచున్న తన ప్రజలను విడిపింపగల దేవుని శక్తిని గూర్చి మోషేకు అప్పటికింకా తెలియలేదు.* “మీరు లేఖనములను గాని, దేవుని శక్తిని గాని ఎరుగకపోవుటవలననే పొరబడుచున్నారు” ( మార్కు 12:24 ). *నీవు లేఖనములను ఎరిగియుంటే, నీవు ఎంత గొప్ప శక్తిగల దేవునిని కలిగియున్నావో గ్రహిస్తావు. మనము దేవునిని మోచేతి దూరములోనే ఉంచకుండా ఉందాము.* *God bless you* |