సమయము కొంచెమే ఉన్నది కనుక సద్వినియోగం చేసుకోండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును. ( హెబ్రీయులకు 10:37).
మన అందరితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుతున్న మాటలు ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. సహోదరుడా! భూమి మీద నీ కొరకు చాలా మనుగడ అతని అనుకోవద్దు. కాలము బహు కొంచెముగా ఉన్నది. అది ఎంతో చెప్పలేం.
ఒక దినమా, ఒక నెలా, ఒక సంవత్సరమా ఎవరికీ తెలియదు. కానీ చాలా తక్కువ సమయం ఉంది. వచ్చుచున్న వాడు ఇక ఆలస్యం చేయక వచ్చుచున్నాడు మొన్నటి వరకు, నిన్నటి వరకు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు అనే చెప్పాము. కానీ ఇప్పుడు చెప్పవలసిన మాట ఏమిటో తెలుసా? ఇదిగో ఇక ఆయన ఆలస్యం చేయక వచ్చుచున్నాడు. అవును పిల్లలారా ప్రభువు రాకడ సమయము చాలా సమీపంగా ఉంది. ఇప్పటిదాకా ఆయన ఆలస్యం చేశాడు కానీ ఇక ఆయన ఆలస్యం చేయక వచ్చుచున్నాడు.
జల ప్రళయం వస్తుంది అనే చెప్పారు వచ్చేసింది, ఓడ తలుపు వేయబడింది ఇవే సంభవలూ మీరు చూడబోతున్నారు. ఈ మాటలు మా చిన్ననాటి నుండి వింటున్నాము అనే మీరు అంటారేమో ఇప్పటివరకు ఆలస్యం చేశారు కానీ ఇప్పుడు ఆలస్యం చేయడం లేదు ఇప్పటివరకు ఆయన ఎందుకు ఆలస్యం చేశారు?
కొందరు ఆలస్యం అనే ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవరు నశింప వలెనని నిర్ణయించాక, అందరూ మారుమనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇప్పటివరకు ఆలస్యం చేశారు, ఆయన దీర్ఘశాంతము గలవాడే కానీ శాశ్విత కాలము వరకు సహిస్తూ చూడండి. రెండువేల సంవత్సరముల క్రితమే రక్షణ సువార్త పాపుల పాపము నుండి పొందడానికి ఇవన్నీ కూడా రక్షణ సువార్త, రాజు సువార్త, యువతులకు బడినది. రాజు సువార్త ఇప్పుడు ప్రకటింప బడుతున్నది. రక్షణ సువార్త రెండువేల క్రితమే ఏమి చేస్తే, ఎవరిని అంగీకరిస్తే, ఏ ప్రభువును ఆరాధిస్తే, ఏ సిలువ రక్తం దగ్గరకి వస్తే రక్షణ, మారుమనస్సు, ప్రాయశ్చిత్తం, కలుగుతుందో 2000 సంవత్సరముల నుండి యూదులకు కాకుండా మిగిలిన ప్రజలకు భూమి మీద ఉన్న అన్యజనులకు రెండువేల సంవత్సరముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన ఏర్పాటులో ఉన్న వారికి బోధిస్తూ ఉన్నారు.
ప్రభువు ఇంకనూ దీర్ఘశాంతము చూపిస్తూనే ఉన్నాడు ఇక ఆలస్యం చేయక కాలమో బహు ఉన్నది ఏదో చేద్దాం, ఏదో సంపాదిద్దాం అనే ఆలోచించొద్దు. ఇది కాదు ప్రస్తుతానికి కావలసింది ప్రభువు రాకడ ఆలస్యమైతే నీకు ప్రభువు ఏమి ఇవ్వాలో అవి అనుకూల సమయాన్ని బట్టి నీ ప్రార్థన ఆలకిస్తూ నీకు కావలసిన అవసరాలను సమకూరుస్తున్నాడు.
ప్రియమైన దేవుని ప్రజలారా! సమయము కొంచెమే ఉన్నది కనుక సద్వినియోగం చేసుకోండి. మీ సమయమును ప్రార్ధనలో గడపండి, వాక్యమును చదవండి, రక్షణ లేని మీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయండి. ఇప్పటినుండి అయినా దేవునికి ఇష్టమైన రీతిలో ప్రవర్తించండి.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక ! ఆమెన్….